TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం

Published on: Fri Sep 5, 2025 6:37PM

 

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. మాజీ సీఎం వైఎస్ జగన్‌ సోదరుడు, వైఎస్ అనిల్ రెడ్డి  పీఏగా దేవరాజులను సిట్ విచారణకు పిలిచింది. ఈ కేసుకు సంబంధించి ఆయన ప్రశ్నిస్తోంది. సిట్‌కు  ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా కేసు  కీలక పురోగతి సాధిస్తుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. 

కాగా ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు  10 మందిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇక ఇదే కేసులో గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, మంత్రిగా పని చేసిన నారాయణ స్వామిని సైతం సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా ఆయన స్టేట్‌మెంట్‌ను వారు రికార్డు చేసుకున్నారు.