TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం...అవి మీకు కనిపించవా?

Published on: Wed May 2, 2018 5:46PM

 

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికుల సంఘం నాయకులు భూసేకరణ ద్వారా ఉపాధి కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని హైకోర్టు ను గతంలో ఆశ్రయించిన సంగతి తెల్సిందే. ఇక దీనిపై విచారణ జరిపిన కోర్టు... రైతుకూలీలకు పునరావాసం కలిపించనందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలవెతలు మీకు కనిపించవా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  వ్యవసాయ కూలీలకు పునరావాసం కలిపించే విషయంలో ఎగవేత ధోరణి అవలబిస్తూ ఉందని ఆ తప్పు ప్రభుత్వం ఒప్పుకోవాలని నిర్దేశించింది. వందలాది గ్రామాలలో భూసేకరణ జరిపి అమాయకపు నిరుపేద వ్యవసాయకూలీలకు సరైన పునరావాసం కలిపించటం వెంటనే జరగాలని ఆదేశించింది. లేకుంటే న్యాయస్థానం సూక్ష్మ సందర్శనం చేయటానికి సిద్దమౌతుందని హెచ్చరించింది.  వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వానికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఒక్క అవకాశమిచ్చింది. పూర్తి నిజాలు లేని పక్షంలో రాష్ట్ర మంతటా "భూసేకరణపై స్టే" విధిస్తామని హెచ్చరికలు చేసింది.