TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీస్సార్ ఆంజనేయులు అరెస్టు

Published on: Tue Apr 22, 2025 8:56AM

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. ముంబై నటి జత్వానీ కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. బేగంపేటలోని ఆయన నివాసంలో అదుపులోనికి తీసుకుని విజయవాడకు తరలించారు.  ప్రస్తుతం సస్సెన్షన్ లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు జగన్‌ హయాంలో  ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.

  ముంబై సినీ నటి జత్వానీ వైసీపీ నేత కుక్కల  విద్యాసాగర్‌పై  పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడానికి గత జత్వానీపై కేసు బనాయించి, అక్రమంగా ముంబై నుంచి విజయవాడకు తీసుకు వచ్చి నిర్బంధించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు నటి జత్వానీ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, అప్పుడు విజయవాడ సీపీగా ఉన్న కాంతిరాణాతాతా, డీసీపీగా ఉన్న విశాల్ గున్నీపై చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.   ఇప్పుడు ఆ కేసులోనే పీఎస్సార్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.