TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐఏఎస్ పెళ్లి మ‌ళ్లీ మ‌ళ్లీ.. వీడియో వైర‌ల్‌...

Published on: Wed Jan 12, 2022 10:55AM

ఆయ‌నో సీనియ‌ర్ ఐఏఎస్‌. ఏపీ ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌విలో ఉన్నారు. ఉద్యోగంలో ఆయ‌న‌కు మంచి పేరే ఉంది. ఆయ‌నంటే అంద‌రికీ గౌర‌వం కూడా. అలాంటి ఐఏఎస్ అధికారి.. మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు. బంధువులు, స్నేహితులు ఎవ‌రికీ చెప్ప‌కుండా.. ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా.. సిటీకి దూరంగా... విశాఖ మ‌న్యంలో గిరిజ‌న సంప్ర‌దాయంలో పెళ్లి చేసుకున్నారు. ఐఏఎస్ ఆఫీస‌ర్ మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డం.. అదికూడా అడ‌విలో చేసుకోవ‌డం.. ఆ వివ‌రాల‌న్నీ ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.

విశాఖ ఏజెన్సీ పర్యటనకు వెళ్లిన‌ ఏపీ గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే మళ్లీ పెళ్లికొడుకయ్యారు. అరకు లోయ సమీపంలోని గిరి గ్రామదర్శినిలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో కాంతీలాల్‌ దంపతులు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆ గిరిజ‌నులు త‌మ గ్రామానికి వ‌చ్చిన ఆ ఉన్న‌తాధికారి దంప‌తుల‌ను అలా గౌర‌వించారు మ‌రి.

గిరి గ్రామదర్శిని నిర్వాహకులు, పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ పెళ్లి పెద్దగా వ్యవహరిస్తూ ఆ జంటకు వివాహం జరిపించారు. వివాహం అనంతరం గిరిజ‌నుల‌తో క‌లిసి.. కాంతిలాల్‌ దండే, ఆయన సతీమణి గౌతమిలు.. థింసా నృత్యం చేశారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు ఐఏఎస్ కాంతిలాల్ దండే.