అఖిలప్రియను హెచ్చరించిన హోం మినిస్టర్

 

నంద్యాలలోని తన అనుచరుల ఇళ్లలో అర్ధరాత్రి పోలీసుల సోదాలు నిర్వహించడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ తన గన్ మెన్లను తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆమెకు మద్దతుగా  సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి సైతం గన్ మెన్లను వెనక్కు పంపారు. కాగా ఈ వ్యవహారంపై హోం మినిస్టర్ చినరాజప్ప స్పందించారు. అఖిలప్రియ తెలుసుకోవాల్సింది చాలా ఉందని, ఏదైనా సమస్యలు ఎదురైతే వెంటనే పార్టీ, ప్రభుత్వంలో పెద్దల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ విషయం సీఎం దృష్టికి కూడా వెళ్లిందని, ముఖ్యమంత్రి చంద్రబాబే సమస్యను పరిష్కరిస్తారని చినరాజప్ప స్పష్టం చేశారు. ప్రజాప్రతినిదులకు భద్రత కల్పించాల్సిన భాద్యత హోం మినిస్టర్ గా తనపై ఉందని పేర్కొన్నారు. రక్షణ వద్దని గన్ మెన్లను,పోలీసులను తిరస్కరిస్తే భద్రతా పరమైన సమస్యలు ఎదురైతే ఎవరు భాద్యత వహించాలని ప్రశ్నించారు. అఖిలప్రియ పట్టువిడవాలని హెచ్చరించారు.