TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విద్యాహక్కు చట్టం అమలు చేయకపోతే జైలుకే.. ఏపీ అధికారులకు హైకోర్టు వార్నింగ్

Published on: Fri Sep 2, 2022 8:13AM

విద్యాహక్కు చట్టం కింద ఎంత మంది పేద విద్యార్థులకు ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లు ఇచ్చారో తమకు లెక్కలు చెప్పాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ చట్టం కింద ప్రతి ప్రైవేటు స్కూళ్లోనూ పాతిక శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలి.

అయితే ఈ చట్టం ఏపీలో సరిగా అమలు కావడం లేదంటూ ఓ న్యాయవాది కోర్టుకు ఎక్కారు. దీనిపై ఏపీ సర్కార్ పై సీరియస్ అయిన హైకోర్టు.. విద్యాహక్కు చట్టం అమలుపై తాము గతంలో ఇచ్చి ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. విద్యాహక్కు చట్టాన్ని, తమ ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేసినట్లు ఆధారాలు చూపాలని, విద్యాహక్కు చట్టం కింద ఎంత మంది పేద విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారో లెక్కలు చెప్పాలనీ పేర్కొంది.

లేకపోతే అధికారులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. విద్యాహక్కు చట్టం కివంద పేద విద్యార్థులు స్కూళ్లో లేకపోతే మీరు జైల్లో ఉండాలని తీవ్ర హెచ్చరిక చేసింది.