TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఎస్ఈసి యాప్ కి బ్రేక్.. ఈ నెల తొమ్మిది వరకు ఆపాలన్న హైకోర్టు ? 

Published on: Fri Feb 5, 2021 3:16PM

 

*ఏపీ పంచాయితీ ఎన్నికల సందర్బంగా ఎన్నికల పిర్యాదుల సేకరణకు కోసం ఎన్నికల కమిషన్ రూపొందించిన  ఈ - వాచ్ యాప్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ-వాచ్‌ యాప్‌ను 9వ తేదీ వరకు ఆపరేట్‌ చేయొద్దని న్యాయస్థానం ఎన్నికల కమిషన్ కి ఆదేశించింది. ఈ-వాచ్‌ యాప్‌కు సెక్యూరిటీ డేటా సర్టిఫికెట్‌ కోసం గురువారమే దరఖాస్తు చేశారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ పేర్కొంది. అనుమతి ఇచ్చేందుకు 5 రోజులు పడుతుందని ఏపీటీఎస్‌ చెప్పింది. ఈలోపు యాప్‌ను పరిశీలించాలని ఏపీటీఎస్‌కు ధర్మాసనం సూచించింది.ఈ నెల 9కి విచారణ వాయిదా పడింది.

సెక్యూరిటీ పరిశీలన లేకుండా యాప్‌ను ఉపయోగించడానికి వీల్లేదని పిటిషనర్లు కోరారు. ప్రభుత్వ యాప్‌ ఉండగా ఈ యాప్‌ను ఎందుకు కొత్తగా క్రియేట్  చేశారని పిటిషనర్లు ప్రశ్నించగా.. ఎస్‌ఈసీకి ఒక యాప్‌ను రూపొందించుకునే అనుమతి భారత ఎన్నికల సంఘం ఇచ్చిందని ఎన్నికల కమిషనర్‌ న్యాయవాది స్పష్టం చేశారు. గతంలో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల కమిషన్‌ కూడా ఇలా తయారు చేసిందని న్యాయవాది వెల్లడించారు.