ఏపీ ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీస్... రఘురామ కేసులో హైకోర్టు సీరియస్
Published on: Wed May 19, 2021 12:39PM
నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహరంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మెజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్స్‌ను రద్దు చేయాలని.. ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. హైకోర్టు, మెజిస్ట్రేట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని.. ఏపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం నిలదీసింది. మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినా.. సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు సీరియస్ అయ్యింది. రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది.
ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద నోటీసులివ్వాలని ఆదేశించింది. సీఐడీ అడిషనల్ డీజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు నోటీసులివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కారం కింద వెంటనే నోటీసులు జారీ చేయాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌కు ఆదేశాలిచ్చింది. పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు స్పందిస్తాయని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.


