జగన్ రెడ్డికి బిగ్ షాక్.. టీడీపీ నేత పట్టాభికి బెయిల్
Published on: Sat Oct 23, 2021 4:08PM
తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కు బెయిల్ మంజూరైంది. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పట్టాభికి బెయిల్ ఇచ్చింది. సెక్షన్ 41 ఏ నోటిసులపై పోలీసులు కింది కోర్టు సూచనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం జగన్‌పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పట్టాభి బెయిల్ రావడంపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


