ఏపీ స్థానిక ఎన్నికల వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగులకు హైకోర్టు షాక్
Published on: Tue Jan 19, 2021 1:20PM
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్న సంగతి తెల్సిందే. వచ్చే ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా హైకోర్టు ఆ షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది. ఇది ఇలా ఉండగా కరోనా టైంలో ఎన్నికలు జరపడానికి వీల్లేదని ఉద్యోగ సంఘాలు తమ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. తాజాగా ఇదే విషయమై.. స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగుల ఫెడరేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఏపీ హైకోర్టు ఈరోజు దానిని కొట్టేసింది.
మరో పక్క ఇదే విషయంపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న, ఈరోజు విచారణ జరిగింది. దీనిపై తీర్పు ఇంకా రావాల్సి ఉంది.


