TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

6 నెల‌ల్లో అమ‌రావ‌తి క‌ట్టాల్సిందే.. హైకోర్టు సంచ‌ల‌న తీర్పు.. జ‌గ‌న్‌కు బిగ్ షాక్‌..

Published on: Thu Mar 3, 2022 10:05AM

అమరావతి, మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు సంచ‌ల‌న‌ తీర్పు ఇచ్చింది. సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. ఆరు నెలల్లో ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశించింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని ఉత్త‌ర్వులు ఇచ్చింది.

రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదు హైకోర్టు తెలిపింది.