TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సజ్జల భార్గవ్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Published on: Fri Apr 17, 2026 9:07PM

 

వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. సజ్జల బార్గవ్ రెడ్డి , ఇతర నిందితులది ఆనాగరిక, ఆటవిక ప్రవర్తన అని ఇతరుల గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తనపై జారీ చేసిన ఎల్‌ఓసీని .. అంటే నిందితులు దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి జారీ చేసే ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవ్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం (17-4-26) విచారణ జరిగింది.

 సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రుల కుటుంబ సభ్యుల ప్రతిష్ఠకు భంగం కలిగించే పోస్టులు ఎలా పెడతారని న్యాయస్థానం ప్రశ్నించింది. వాక్ స్వాతంత్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తును సక్రమంగా చేసి నిందితులకు శిక్షపడేలా చేయాలని పోలీసులను ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కోరినప్పుడు విచారణకు హాజరు అవుతానని అఫిడవిట్ వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎల్ఓసీని రీ కాల్ చేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్దన వచ్చిన వెంటనే ఎల్ఓసీని రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులకు ఏపీ హై కోర్టు ఆదేశించింది.