TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

దీవెన అలా కుదరదు.. జగనన్నకు హైకోర్టు మరో షాక్

Published on: Fri Sep 3, 2021 6:31PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్.. ఇది ఏపీలో ఇప్పుడు రోటీన్ గా మారింది. ప్రతి రోజూ ఏదో ఒక కేసులో జగన్ రెడ్డి ప్రభుత్వానికి న్యాయ స్థానాల్లో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అనాలోచితంగా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ జీవోలు ఇస్తోంది జగన్ ప్రభుత్వం. చట్ట విరుద్దమంటూ ఎవరో ఒకరు కోర్టుకు వెళుతున్నారు. విచారణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుండటంతో కోర్టులు జీవోలను కొట్టివేస్తూ ఆదేశాలు ఇస్తున్నారు. కోర్టుల్లో వరుసగా మొట్టికాయలు పడుతున్నా వైసీపీ ప్రభుత్వ తీరు మాత్రం మారడం లేదు. దీంతో తాజాగా మరో కేసులోనూ జగనన్నకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. 

జగనన్నవిద్యా దీవెన పథకం చెల్లింపులలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విద్యా దీవెన కార్యక్రమం కింద తల్లుల బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది. అయితే తల్లులు ఫీజు చెల్లించకపోతే తమకు సంబంధం లేదని ప్రభుత్వం  స్పష్టం చేసింది. అయితే ఫీజులను కాలేజీ ప్రిన్సిపాల్ అకౌంట్లో జమ చేయాలని న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ కోర్టును ఆశ్రయించారు. కృష్ణదేవరాయ విద్యా సంస్థల తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇరు వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పు ఇచ్చింది. విద్యా దీవెన డబ్బులు విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్‌ అకౌంట్లలో జమ చేయాల్సిందేనని కోర్టు ఆదేశించింది. నేరుగా కాలేజీల అకౌంట్లలో డబ్బులు జమ అవ్వాలని సంబంధిత అధికారులకు హైకోర్టు ఆదేశించింది.