రుణాల రీషెడ్యూల్ పై ఆర్బిఐకి ఏపీ సమాధానం


రుణమాఫీ అంశంపై రిజర్వ్ బ్యాంకు లేఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానమిచ్చింది. రుణాల రీషెడ్యూల్ మూడేళ్ళు అన్న ఆర్బిఐ విధానాన్నిఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విబేధించింది. రుణాల రీషెడ్యూల్ ఆరేళ్ల పాటు పొడిగించాలని, ఒక ఏడాది మారటోరియం విధించాలని ఎపి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకును కోరింది. బంగారు రుణాలను వ్యవసాయ రుణాలుగా పరిగణించాలని లేఖలో పేర్కొంది. త్వరలోనే కొత్త రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరింది. ఇక రుణాలు ఎలా చెల్లిస్తామనే కార్యాచరణకు సమాధానంగా త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో వ్యవసాయ రుణాలు ఎన్ని వున్నాయో వివరాలు ఇవ్వాలని ఎస్ఎల్ బీసీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.