తిరుమల శ్రీవారి దర్శనానికి గ్రీన్ సిగ్నల్
Published on: Tue Jun 2, 2020 2:20PM
తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. స్వామి దర్శనానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు, శ్రీవారి దర్శనానికి అనుమతినిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వాంటూ టీటీడీ బోర్డు ఈవో అనిల్ సింఘాల్ ఇటీవల లేఖ రాశారు. టీటీడీ బోర్డు ఈవో లేఖపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. శ్రీవారి దర్శనానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులను అనుమతించే ముందు టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో స్వామి వారి దర్శన ట్రయల్ నిర్వహించాలని సూచించారు. ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, మార్గదర్శకాలు వెల్లడికానున్నాయి.


