రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్‌ రద్దు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుతో రాయలసీమ స్టీల్స్ లిమిటెడ్‌ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ పర్యవేక్షణలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని తెలిపింది. 

 

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పోరేషన్‌ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ పేరిట కడపలో ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ కు మధుసూదన్‌ను తాత్కాలిక సీఎండీగా నియమించారు. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, గత కొన్ని రోజులుగా రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు.