TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

30న గవర్నర్ తో జగన్ భేటి

Published on: Thu Sep 26, 2013 6:54PM

 

AP Governor Narasimhan, jagan Governor Narasimhan, jagan AP Governor Narasimhan

 

 

వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత మొదటిసారిగా గవర్నర్ నరసింహన్ కలవబోతున్నారు. సమైక్యాంధ్ర తీర్మానం అసేంబ్లీలో చేయాలని, తెలంగాణ తీర్మానాన్ని ఓడించాలని కోరుతూ గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. గవర్నర్ సెప్టెంబర్ 30 తేదిన సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్ మెంట్ కేటాయించారు.

 

ప్రత్యేకంగా అసేంబ్లీని సమావేశ పరిచి సమైక్య తీర్మానం చేయాలని జగన్ కోరనున్నారని పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలిపారు. అసేంబ్లీ తీర్మానం తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను ఆమోదించుకోనున్నారు.   



ఇక వచ్చే నెల 1,2 తేదీలలో కడప జిల్లాలోని ఇడుపుల పాయకు వెళ్లేందుకు, నాలుగో తేదీన గుంటూరుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో ఈ రోజు పిటీషన్ దాఖలు చేశారు.