TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మూడు రాజ‌ధానుల‌పై సుప్రీంను ఆశ్ర‌యించిన ఏపీ స‌ర్కార్‌

Published on: Sat Sep 17, 2022 1:42PM

మూడు రాజధానుల పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును.. సుప్రీంకోర్టు లో ఏపీ సర్కార్‌  సవాల్‌ చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు తీర్పును వెలువరించింది. అలా చేయడమంటే శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ సర్కార్ పేర్కొంది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపేయాలనుకోవడం శాసన వ్యవస్థ అధికారాలను ప్రశ్నిం చ డమే అవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. 

సీఆర్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, నెల రోజుల్లో అమరావతిలో అన్ని సదు పాయాలను కల్పించాలని హైకోర్టు ఆదేశించడం సరికాదని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యంకాదని పిటిషన్లో తెలిపింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసన సభకు లేదని చెప్పడం శాసనసభను అగౌరవపరచడమేనని చెప్పింది. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు  రాజధానులని పిటిషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ సర్కార్‌ తెలిపింది. కాగా.. మూడు రాజధానుల బిల్లు ను వెనక్కి తీసుకుంటున్నట్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కు తెలిపిన విషయం తెలిసిందే.  రాజధా ను ల అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏజీ దాఖలు చేసిన అఫిడవిట్ లో పొందు పర్చారు. తిరిగి తాజాగా మూడు రాజధానుల అంశాన్ని లేవనెత్తారు. ఎలాగైనా సరే రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుందో వేచి చూడాలి.