హీరోయిన్ జిత్వానీ అంశంపై విచారణకు ఆదేశం!
Published on: Thu Aug 29, 2024 1:19PM
వైసీపీ నాయకుల, పోలీసు అధికారుల చేతిలో శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురైన ముంబై హీరోయిన్ జిత్వానీ అంశం మీద ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. జిత్వానీ నుంచి ఆన్‍లైన్‍లో ఫిర్యాదు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ప్రతి అంశాన్ని క్షుణంగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై కమిటీని కూడా నియమించే అవకాశం వుందని తెలిసింది.


