ఏపీలో వృద్దుల పింఛన్లలో ఇంత దారుణమా !!

 

 

మొన్న ఏప్రిల్ లో ఎపి అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో వైసిపి అధినేత జగన్ నవరత్నాల తో పాటు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఆ హామీలలో  వృద్దులను అమితంగా ఆకట్టుకుని వారి ఓట్లను కొల్లగొట్టిన హామీ వృద్ధుల పింఛన్ ను రూ 3000 కు పెంచడం. ఐతే జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత అప్పటి వరకు రూ 2000 గా ఉన్న పింఛన్ ను రూ 2250 కు పెంచి వృద్దులకు అందిస్తున్నారు. పింఛన్ మూడు వేలు చేస్తామన్నారు కదా అని వృద్దులు ప్రశ్నిస్తే వైసిపి నేతల నుండి వచ్చిన సమాధానం మేము మూడు వేలకు పెంచుకుంటూ పోతామన్నాం అని. ఐతే గత ప్రభుత్వం అధికారం లో ఉన్నపుడు వృద్దులకు 1 లేదా 2వ తేదికి ఇంటికి వచ్చి పింఛన్లు అందచేసేవారు. ఐతే ఇప్పుడు ఎదో ఒక కారణం తో పదో తేదీ వరకు పింఛను అందని  పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కుక్కునూరు వేలేరుపాడు గ్రామం లో ఐతే ఏకంగా పింఛను సొమ్ములో దొంగ నోట్లు పంచినట్లు వార్తలు వస్తున్నాయి. వృద్దులకు దొంగ నోట్లు పంచితే మరి పంచాల్సిన అసలు నోట్లు ఎటు పోయినట్లు అని విమర్శలు వినిపిస్తున్నాయి.