TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జీవో నంబర్ 1 సస్పెన్షన్ సవాల్ చేస్తూ సుప్రీం కు జగన్ సర్కార్

Published on: Tue Jan 17, 2023 4:08PM

రాష్ట్రంలో సభలూ సమావేశాలను నిషేధిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 1 ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.

ఏపీ సర్కార్ జీవో నంబర్ 1 ను  ఈ నెల 23 వరకూ సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి విదితమే. రాష్ట్రంలో అనుమతి లేకుండా సభలూ, రోడ్ షోలు  నిర్వహించడాన్ని నిషేధిస్తూ జగన్ సర్కార్ జీవో నంబర్ 1 జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఆ జీవోను చూపే కుప్పంలో చంద్రబాబు నాయుడి సభను అడుగడుగునా జగన్ ప్రభుత్వం అడ్డుకుంది. భారీగా పోలీసులను మోహరించి చంద్రబాబు కార్యక్రమానికి జనం రాకుండా అడ్డుకుంది.