TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పంట పొలాల క్రింద పైప్ లైన్స్?

Published on: Sat Mar 14, 2015 10:10AM

 

రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టే వివిధ ప్రాజెక్టులలో అన్నిటి కంటే క్లిష్టమయిన ప్రక్రియ భూసేకరణే. ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేప్పట్టిన భూసేకరణ ప్రక్రియ అందుకు అద్దం పడుతోంది. ప్రభుత్వం 40, 000 ఎకరాలు భూసేకరణ చేద్దామనుకొంటే ఇప్పటి వరకు అతికష్టం మీద 32, 0000 ఎకరాలు సేకరించగలిగింది. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొదలుపేట్టబోయే జల హారం (వాటర్ గ్రిడ్) ప్రాజెక్టులో భాగంగా నీళ్ళ గొట్టాలు వేసేందుకు భూసేకరణ చేయాలంటే ఇంకా చాలా కష్టం అవుతుంది. కనుక దాని అవసరం లేకుండా అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికీ కూడా పెద్దగా నష్టం లేకుండా వ్యవసాయ భూములున్న ప్రాంతాలలో వాటి క్రింద నుండి గొట్టాలు వేసేందుకు వీలుగా ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తద్వారా పంట పొలాల క్రింద ఉండే భూమిని వినియోగించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. ఈ విధానాన్ని మొదట గుజరాత్ రాష్ట్రంలో అమలుచేసారు. తరువాత తెలంగాణా రాష్ట్రంలో అమలుచేయబోతున్నారు. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అమలుచేయాలని భావిస్తోంది. అందుకోసం ఆ రెండు ప్రభుత్వాలు రూపొందించిన నియామావళి, అనుసరిస్తున్న విధివిధానాలు, పద్దతులను రాష్ట్ర రెవెన్యూ మరియు జలవనరుల శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వారి అధ్యయనం పూర్తి చేసి తమ నివేదికను అందజేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేస్తుంది. బహుశః ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాలున్నాయి.