TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శభాష్ ఏపీ సర్కార్

Published on: Mon Sep 15, 2014 7:39PM

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణా ఆర్ధికంగా కొంచెం బాగానే ఉంది. అంతే కాదు వ్యవసాయ రుణాల భారం కూడా తక్కువే ఉంది. అయితే నేటికీ తెలంగాణా ప్రభుత్వం ఈ విషయంలో అడుగు ముందుకు వేయలేకపోతోంది. కానీ తీవ్ర ఆర్ధిక సమస్యలతో క్రుంగిపోయున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాలా ముందుందని చెప్పవచ్చును. పంట రుణాలమాఫీ చేయాలనే తన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని దృవీకరిస్తూ ప్రభుత్వం ఒక జీ.ఓ. జారీ చేయడమే కాకుండా, ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో అక్టోబరు మొదటి వారం నుండి దానిని అమలు చేయాలని నిర్ణయించుకొంది. కానీ ఇప్పటికిప్పుడు వేల కోట్ల రుణాలు ఒకేసారి తీర్చే పరిస్థితిలో లేనందున, తోలి విడతగా రూ.10, 000 కోట్ల రుణాలను మాఫీ చేయాలని నిశ్చయించుకొంది.

 

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున పలు చర్యల కారణంగా త్వరలోనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని, అప్పుడు మిగిలిన పంట రుణాలను కూడా ఇదేవిధంగా తీర్చివేయగలనని భావిస్తోంది. అటు కేంద్రం కానీ రిజర్వు బ్యాంకు కానీ ఈ విషయంలో ఎటువంటి సహాయం చేయకపోయినా, తీవ్ర ఆర్ధిక సమస్యలు చుట్టి ముట్టి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా దైర్యంగా, చాలా నేర్పుగా పంట రుణాలను తీర్చి రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం చాలా అభినందనీయం.