బనకచర్ల డీపీఆర్ తయారీకి నోటిఫికేషన్
Published on: Wed Oct 8, 2025 8:36AM
.webp)
బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ డిజైన్‌తో పాటు లిఫ్ట్‌లు, టన్నెళ్లు కట్టే చోట ఇన్వెస్టిగేషన్ చేయడం, కేంద్రం నుంచి అనుమతులు వచ్చేందుకు వీలుగా నివేదిక తయారు చేయాలని నోటిఫికేషన్‌లో పేరొన్నది. కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాల్సి ఉంటుందనీ నోటిఫికేషన్ లో పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆ కన్సల్టెన్సీదేనని పేర్కొంది. ఇందు కోసం
9.20 కోట్లు కేటాయించింది ఆ నోటిఫికేషన్ మేరకు బుధవారం (అక్టోబర్ 8) నుంచి 22వ తేదీవరకూ అనుభవజ్ణులైన కన్సెల్టెన్సీలు బిడ్ లో పాల్గొనేందుకు వీలుగా టెండర్లు దాఖలు చేయవచ్చు.


