ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ సస్పెన్షన్!
Published on: Mon Aug 19, 2024 1:20PM
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫైబర్ నెట్‌లో ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు వున్నాయి. ఫైబర్ నెట్ సంస్థలో భారీ సంఖ్యలో తన బంధువులను నియమించి వందల కోట్ల దోపిడీకి మధుసూదన్ రెడ్డి పాల్పడ్డారని, మెటీరియల్ కొనుగోలు, నియామకాలలో గోల్‌మాల్ చేశారని పలువురు మధుసూదన్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.



