భన్వర్ లాల్ పై కాంగ్రెస్ ఆగ్రహం !
Published on: Mon Jun 4, 2012 6:05PM
సిబిఐ అరెస్టు చేసిన వై.కా.పా. అధినేత జగన్మోహనరెడ్డి నీడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ఉన్నారేమోనని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికే ఈ విషయంలో సందేహం వచ్చిందంటే భన్వర్ లాల్ పై ప్రచారం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన కాంగ్రెస్ అధినాయకులు సైతం భన్వర్ లాల్ ను అనుమానిస్తున్నారు.
తిరుపతి ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలపై ఎన్నికల కమిషన్ సంజాయిషీ కోరటం తీవ్రరచ్చకు దారితీసింది. ఈ సమయంలోనే ఒక్క కేసు కూడా వై.కా.పా.పై పెట్టకుండా ఎన్నికల కమిషన్ తమను మాత్రమే ఎందుకు ఇరికిస్తోందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాము ఎన్ని ఫిర్యాదులు జగన్ అక్రమాలపై చేసినా, సాక్షిలో ప్రచురణల గురించి చేసినా ఇసి పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలు ఉమా మల్లేశ్వరరావు, అనురాధ ఆరోపించారు. ఏమైనా ఈ ఎన్నికలు పూర్తయ్యాక మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మార్పు తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు.


