ఎంసెట్, ఐసెట్ పరీక్షల షెడ్యూల్‌ ఇదే..!

ఇంజనీరింగ్, మెడిసిన్‌తో పాటు వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశంలో ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షల తేదీలను ప్రకటించారు. ఏప్రిల్ 19న ఎడ్‌సెట్, లాసెట్, ఏప్రిల్ 22 నుంచి 25 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్, ఏప్రిల్ 26న ఎంసెట్(బైపీసీ) పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే మే 2న ఐసెట్, 3న ఈసెట్, మే 10 నుంచి 12 వరకు పీజీఈసెట్.. మే 4 నుంచి పీఈ సెట్ నిర్వహించనున్నట్లు గంటా వెల్లడించారు.