ఏపీ లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 7,060 మందిపై కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన  7,060 మందిపై కేసులను నమోదు చేసినట్టు రాష్ట్ర డి జి పి గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. బెజవాడలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన డి జి పీ గౌతమ్ సవాంగ్ లాక్ డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. " ప్రజలకు చాలా వరకు అవగాహనవచ్చింది.ఇప్పటికే ప్రజలు నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దు.ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాం.విదేశాలు నుండి తిరిగి వచ్చే వారిపై నిఘా చేపట్టాం," అని డి జి పీ ఇచ్చారు. 

ఇప్పటి వరకు 22 వేలమందిని గుర్తించామని చెప్పిన డి జి పీ, నిత్యావసరవస్తువులు రవాణా చేసే గూడ్స్ వాహనాలకు అనుమతి ఇచ్చినట్టు, పోలీసు ఫ్యామిలీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 
హోమ్ డెలివరీ సిస్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలీసు డిపార్ట్మెంట్ లో 55 సం.లు పైబడినవారికి హై రిస్క్ డ్యూటీలు లేకుండా ఆఫీసులో ఉండేలా చూడాలని సూచించామన్నారు గౌతమ్ సవాంగ్.