ఏపీ సీఎం జగన్‌ను కలిసిన డీజీపీ
Published on: Fri May 31, 2019 12:52PM

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా 'గౌతమ్‌సవాంగ్'ను నియమిస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న 'ఆర్.పి.ఠాగూర్'ను ప్రింటింగ్, స్టేషనరీ కమీషనర్‌గా నియమించింది. ఆ స్థానంలో పనిచేస్తోన్న 'త్రిపాఠీ'ని సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయమని ఆదేశించింది.
కాగా, ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిని ఇవాళ ఉదయం అమరావతిలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కలిశారు. డీజీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశాక గౌతమ్‌సవాంగ్ సీఎంతో భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభధ్రతల అంశంతో పాటు ఐపీఎస్ అధికారుల బదిలీలపై డీజీపీతో సీఎం చర్చించినట్లు సమాచారం. గౌతమ్ సవాంగ్ శనివారం ఏపీ డీజీపీగా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టనున్నారు.


