జగన్ కి చెక్.. కాంగ్రెస్ వస్తేనే ఏపీకి లక్

ఏపీలో కాంగ్రెస్ కనుమరుగు అయిపోయినట్టే అనుకున్నారంతా.. కానీ కాంగ్రెస్ అధిష్టానం, ఏపీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది.. దానిలో భాగంగానే పార్టీకి దూరమైన సీనియర్ నేత మాజీ సీఎం కిరణ్ కుమార్ ని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చారు.. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ ని బలోపేతం చేసే బాధ్యత కిరణ్ కుమార్ కి ఇచ్చారు.. కిరణ్ కూడా దానికి తగ్గట్టే వ్యూహాలు రచించినట్టు తెలుస్తోంది.

 

 

విభజన అనంతరం కాంగ్రెస్ మెజారిటీ ఓటు బ్యాంకు వైసీపీకి వెళ్ళింది.. అందుకే ముందు ఏపీలో వైసీపీని టార్గెట్ చేయాలనుకుంటున్నారట.. కాంగ్రెస్ సిద్ధాంతాలు వేరు, వైసీపీ సిద్ధాంతాలు వేరు అనే మాటని కేడర్ లోకి బలంగా తీసుకెళ్లి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేలా చూస్తున్నారట.. అలానే ఏపీలోని సామాన్యులకు కూడా దగ్గరవ్వాలని చూస్తున్నారట.. ఆంధ్రాకి న్యాయం జ‌ర‌గాలంటే అది జాతీయ స్థాయిలో జ‌ర‌గాల్సిన ప‌ని.. బీజేపీ ఎలాగూ చెయ్య‌దు.. అది కాంగ్రెస్ తో మాత్ర‌మే సాధ్య‌మ‌నే విషయాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారట.. ప్రస్తుతం కాంగ్రెస్ 'జగన్ కి చెక్, కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ఏపీకి లక్' అనే వ్యూహాలతో ఏపీలో పుంజుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.