TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ టైం స్టార్ట్స్.. ఒకరికి కీలక పదవి, నలుగురిపై వేటు

Published on: Thu May 30, 2019 4:02PM

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఉన్న కె.ధనుంజయ్ రెడ్డిని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక జరిగిన తొలి నియామకం ఇదే కావడం గమనార్హం. ధనుంజయ్ రెడ్డి గతంలో వ్యవసాయశాఖలో పనిచేశారు. శ్రీకాకుళం కలెక్టర్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు.

అదేవిధంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఏపీ సచివాలయంలో నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది. గత సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్రతో పాటు ముఖ్య కార‍్యదర్శి సాయి ప్రసాద్‌, సీఎం కార్యదర్శిలు గిరిజా శంకర్‌, రాజమౌళిలను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు.