TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మానవత్వం చాటుకున్న సీఎం జగన్.. రియల్లీ గ్రేట్

Published on: Tue Jun 4, 2019 5:37PM

 

బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్న ఓ వ్యక్తి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో స్పందించారు. క్యాన్సర్ రోగికి అత్యవసరంగా ఆపరేషన్ చేయించాలని, ఆపరేషన్ కు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని జగన్ హామీ ఇచ్చారు. 

ఈరోజు విశాఖ పర్యటనకు వెళ్లిన జగన్.. తిరిగి అమరావతికి వెళ్తుండగా రోడ్డు పక్కన 'బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి' అంటూ కొందరు యువతీ యువకులు ఫ్లెక్సీలను ప్రదర్శించారు. వారిని గమనించిన జగన్ కాన్వాయ్ ను ఆపించి కిందకి దిగి నేరుగా వారి వద్దకు వెళ్లి ఆరా తీశారు. తమ స్నేహితుడు నీరజ్ బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్నాడని ఆపరేషన్ కు రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని ఈనెల 30లోగా అతడికి ఆపరేషన్ చేయించకపోతే తమకు దక్కడని వారు జగన్ వద్ద బోరున విలపించారు. వారి ఆవేదనకు చలించిపోయిన జగన్.. ఆపరేషన్ కు వెంటనే ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ భాస్కర్ ను ఆదేశించారు. తమ స్నేహితుడికి ఆపరేషన్ చేయిస్తానని సీఎం జగన్ హామీ ఇవ్వడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తూ.. ధన్యవాదాలు తెలిపారు.