TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ సీఎంగా జగన్ తొలి సంతకం

Published on: Thu May 30, 2019 2:01PM

 

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్‌ తన తొలి సంతకం దేనిపై చేస్తారోనన్న ఉత్కంఠకు తెరపడింది. పింఛన్ల పెంపు దస్త్రంపైన ఆయన తొలి సంతకం చేశారు. వృద్ధాప్య పింఛను రూ.3వేలు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా తొలి ఏడాది రూ.250 పెంచుతున్నట్లు ప్రకటించారు. జూన్‌ 1 నుంచి రూ.2,250 అందజేస్తామని చెప్పారు. రెండో ఏడాది రూ.2,500, మూడో ఏడాది రూ. 2,750, నాలుగో ఏడాది రూ. 3,000 అందజేస్తామన్నారు. జగన్‌ తొలి సంతకం చేస్తున్న సమయంలో సభా ప్రాంగణం సీఎం జగన్‌ అంటూ అభిమానుల నినాదాలతో మారుమోగింది.