కాల్‌మనీపై సీఎం జగన్ ఆగ్రహం!

 

ఉండవల్లిలోని ప్రజావేదికలో రెండోరోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతిభద్రతల అంశంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాల్‌మనీ అంశంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఏ పార్టీవారున్నా విడిచిపెట్టొద్దని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు ఉంటే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని వ్యాఖ్యానించారు.

ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నియంత్రించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి సాగు చేయకుండా గిరిజనుల్లో అవగాహన కల్పించాలని.. వారిపై కఠినంగా వ్యవహరించే బదులు, వారి జీవనోపాధికి మార్గాలు చూపుతామన్నారు. మళ్లీ గిరిపుత్రులు గంజాయి సాగులోకి రాకుండా జీవనోపాధికి పరిష్కారాలు చూపించాలన్నారు.