TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాన్న చిరునవ్వు, జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి..జ‌గ‌న్‌

Published on: Fri Sep 2, 2022 10:49AM

దివంగత నేత, మాజీ మంత్రి వైఎస్సార్  వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో నివాళి అర్పిస్తూ... వైఎస్సార్‌‌ ను స్మరించుకున్నారు. ‘‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశ చరిత్రలోనే సంక్షే మాన్ని సరికొత్తగా నిర్వచించి,  ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటి చెప్పా రు. ప్రతి అడుగు లోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. 

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర జగన్ నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్ కుటుంబసభ్యులు వైఎస్ విజయమ్మ, భారతి, షర్మిల వైఎస్ఆ ర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. 

కాగా, సీఎం జగన్ వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన విడతల వారీగా ఇవాళ సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై స్థానిక నాయకులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించ నున్నారు.