TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రధాని మోడీతో సీఎం జగన్ మాట్లాడింది తన కేసుల గురించేనా! 

Published on: Mon Jan 3, 2022 4:26PM

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోడీకి జగన్ లేఖ ఇచ్చారు. విభజన హామీలు, పోలవరం, జల వివాదం అంశాలపై ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి జగన్ చర్చించారని ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

అయితే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. తనకు లభించిన సమాచారం మేరకు జగన్ తన బెయిల్ విషయం ప్రధానితో మాట్లాడారని వెల్లడించారు.ప్రధానితో తన బెయిల్ పై మాట్లాడుకుని, ఆపై బయటికి వచ్చి ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు అంశాలపై చర్చించామని చెప్పుకుంటారని రఘురామ పేర్కొన్నారు. ప్రధానితో 20 నిమిషాల సమావేశం జరిగితే, బయట వేచి ఉన్న సమయంతో కలిపి గంట సేపు భేటీ అయ్యామని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. 

ఇంట్లో కూర్చొనే వ్యక్తి ముఖ్యమంత్రి ఏంటండి? అని రఘురామ ప్రశ్నించారు. ఇంట్లోనే ఉండే సీఎం ఏపీలో తప్ప మరెక్కడా ఉండరని తెలిపారు. ఆలయాలకు ధార్మిక సంస్థలు గతంలో ఉండేవని, ఇప్పుడు లేవని చెప్పారు. మాజీమంత్రి వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తారని కథనాలు వస్తున్నాయని, తమ సీఎం అందరిలాగే పీఎంను కలిశాక మాట్లాడతానని ప్రకటించారు. జగన్‌ బెయిల్ పిటిషన్‌ ఎందుకు ఆలస్యం అవుతుందో దేవుడికే తెలియాలి అన్నారు ఎంపీ రఘురామ. కోర్టు అంశంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు.