TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఎదురు అమావాస్యకు ముందు ఆలయాల నిర్మాణమా! 

Published on: Fri Jan 8, 2021 10:55AM

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన తొమ్మిది ఆలయాల పునర్నిర్మాణంపై వివాదం జరుగుతోంది. ఆలయాల పునర్నిర్మాణాన్ని ఎవరూ వ్యతిరేకించనప్పటికి.. అందుకు ఎంచుకున్న సమయంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వరుసగా జరుగుతున్న ఆలయాలపై దాడుల ఘటల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఇందుకు కారణాలు కూడా చెప్పారు జనసేన రాష్ట్ర ధికార ప్రతినిధి పోతిన మహేష్ . ‘‘ఆలయాల పునర్నిర్మాణం శంకుస్థాపన గురు బలం లేని, ఎదురు అమావాస్యకు ముందు ఎందుకో.  దక్షిణాయనంలో, నెల ఘంటా సమయంలో, అమ్మవారి పాదాల చెంత శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టవచ్చా? ఇదంతా రామతీర్థ ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకేనా? ఆగమశాస్త్రం, కృష్ణయజుర్వేదమును పరిగణలోకి తీసుకున్నారా? హిందువుల ఆచారాలు శాస్త్రాలపై గౌరవం లేదని ముఖ్యమంత్రి గారు మరోసారి రుజువు చేసుకుంటున్నారా? రాష్ట్రానికి దుష్పరిణామాలు తప్పవేమో అనే ఆందోళన కలుగుతుంది’’ అని పోతిన మహేష్ ట్వీట్ చేశారు.

కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం గతంలో కొన్ని ఆలయాలను తొలగించారు. అప్పుడు  కూల్చిన ఆలయాలను ప్రభుత్వం పునర్ నిర్మించాలని నిర్ణయించింది. అందులో మొదటగా తొమ్మిది ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహ‌న్‌రెడ్డి ఆలయాలకు భూమిపూజ చేశారు.  శనీశ్వర ఆలయ ప్రాంతంలో రెండు శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు. దుర్గగుడి అభివృద్ధి, విస్తరణ పనులకు సీఎం  జగన్ శంకుస్థాపన చేశారు.