కడప గడపలో టీడీపీ కాలు.. జగన్ కి తప్పని కష్టాలు

 

రాజకీయ పరంగా కడప జిల్లా పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం.. వైఎస్ కుటుంబానికి మొదటి నుండి జిల్లాలో మంచి పట్టుంది.. వారు రాష్ట్ర రాజకీయాలు కడప కేంద్రంగా చేసేవారు.. ఇప్పుడు వైఎస్ వారసుడిగా, ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నారు.. అయితే కడపలో ఒకప్పటిలా వన్ సైడ్ వార్ కనిపించట్లేదు.. జగన్ కి కడపలో కూడా కష్టాలు మొదలయ్యాయి.. దానికి కారణం అధికార పార్టీ టీడీపీ.. టీడీపీ, ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.. అక్కడ పాగా వేయాలని చూస్తోంది.. దానికి తగ్గట్టే అక్కడి ప్రజల్లో మార్పు కనిపిస్తుంది.. టీడీపీ పైన, టీడీపీ అధినేత చంద్రబాబు పైన వారు సానుకూలంగా ఉన్నారు.. ముఖ్యంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజల్లో మార్పు స్పష్టం కనిపిస్తుంది.. దీంతో జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు.. ఈ జోరు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కడపలో ఏదైనా జరగొచ్చు అనిపిస్తోంది.

 

 

అయితే ఒకప్పుడు తమకు కంచుకోటగా ఉన్న కడపలో జగన్ ప్రభ తగ్గటానికి పలు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తోన్నారు.. ముఖ్యంగా జగన్ స్వయంకృతాపరదాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఈ జిల్లా ప్రజల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు, నియోజక వర్గాల్లో పర్యటించకపోయినా పర్వాలేదు.. కడపలో మాకు తిరుగులేదు.. ఓట్లన్నీ మాక్ పడతాయి అని జగన్ ధీమాగా ఉంటున్నారట.. ఈ భావనతోనే ఆయన సొంత జిల్లాని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారట.. దీంతో స్థానిక ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది.. దీన్ని టీడీపీ క్యాష్ చేసుకుంది.. కడప జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు.. జిల్లా ప్రజల మనస్సు దోచుకునేలా పలు వరాలు కురిపించారు.. కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిస్తానని చంద్రబాబు గతంలో వాగ్దానం చేసారు.. అప్పుడు ప్రతిపక్ష వైసీపీ నేతలు వెటకారం చేసారు.. కానీ చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు.. కృష్ణా జలాలను గండికోట ప్రాజెక్ట్ కు రప్పించి పులివెందులకు పుష్కలంగా తాగు, సాగు నీరు అందించారు.. దీంతో నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం చేయలేని పనిని చంద్రబాబు చేసి చూపించారని స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపించారు.. కలలో కూడా నీళ్లొస్తాయని ఊహించలేదు, అలాంటిది చంద్రబాబు నిజం చేసి చుపించారంటూ స్థానికులకు చంద్రబాబు మీద అభిప్రాయం ఏర్పడింది.

 

 

అదే విధంగా కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం చేసిన పోరాటంలో కూడా టీడీపీకి మంచి మార్కులు పడ్డాయి.. నిజానికి ప్రతిపక్ష పార్టీగా వైసీపీ స్టీల్ ఫ్యాక్టరీ కోసం బలంగా పోరాడాలి, కేంద్రాన్ని నిలదీయాలి.. కానీ వైసీపీ ఆ విషయంలో విఫలమైంది.. కానీ చంద్రబాబు ఆలా కాదు టీడీపీ నేత సీఎం రమేష్ తో దీక్ష చూపించారు.. అంతేకాదు కేంద్రం ఏర్పాటు చేయకపోతే స్టీల్ ఫ్యాక్టరీనే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసి తీరుతుందని హామీ ఇచ్చారు.. ఇలా అనేక విషయాల్లో చంద్రబాబు కడప మీద ప్రత్యేక శ్రద్ద చూపారు.. అక్కడ ప్రజల మనస్సు గెలుచుకున్నారు.. ఫలితంగా అక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి.. వచ్చే ఎన్నికల్లో కడపలో టీడీపీ పాగా వేసిన ఆశ్చర్యంలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.. మొత్తానికి జగన్ కి సొంత జిల్లాలో కష్టాలు తప్పేలా లేవు.. చూద్దాం మరి ఏం జరుగుతుందో.