TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

సుప్రీం కోర్టుకు చంద్రబాబు

Published on: Tue May 7, 2019 10:58AM

 

ఏపీ సీఎం చంద్రబాబు సుప్రీం కోర్టుకు చేరుకున్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, టీడీపీ ఎంపీ సుజనాచౌదరి, సీఎం రమేష్‌, మాగంటి బాబు తదితరులతో కలిసి ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు.

ప్రతి అసెంబ్లీ స్థానం పరిధిలో ఐదు వీవీప్యాట్‌ల స్లిప్పులు లెక్కించాలని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల స్పష్టం చేసింది. వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపును కనీసం 50శాతానికి పెంచాలని చంద్రబాబు నేతృత్వంలోని 21 రాజకీయ పార్టీలు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. రివ్యూ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టనుంది. విచారణ జరగనున్న నేపథ్యంలో బీజేపీయేతర పక్షాల నేతలు ఇవాళ సుప్రీం కోర్టుకు హాజరవుతున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు కూడా వెళ్లారు. అంతకముందు చంద్రబాబు.. ఫరూక్‌ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. వీవీ ప్యాట్‌ల అంశంపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.