TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన

Published on: Mon Aug 25, 2014 7:46AM

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ పర్యటన చేయున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి చర్చించడం, హైదరాబాద్‌లో గవర్నర్‌కి ప్రత్యేక అధికారాలు కల్పించడం లాంటి అంశాల గురించి ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చర్చించనున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీకి బయల్దేరి, సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీని కలుస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, గవర్నర్‌కి ప్రత్యేక అధికారాల విషయంలో ఆయన పూర్తి క్లారిటీతో తిరిగొస్తారని తెలుస్తోంది.