TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హస్తినకు చంద్రబాబు.. ఎప్పుడు, ఎందుకు అంటే?

Published on: Sat May 9, 2026 12:00PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  సోమవారం (మే 11) ఢిల్లీ పర్యటనకు వెడుతున్నారు.  ఈ పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన  జలవివాదాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు.

ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో  చంద్రబాబు   ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం,  గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.

ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు కేంద్ర మంత్రికి విజ్ణప్తి చేసే అవకాశం ఉంది. అదే విధంగా  కృష్ణా నదిపై కర్ణాటక నిర్మించిన ఆల్మటి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కూడా చంద్రబాబు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ను కోరే అవకాశం ఉంది.