2018 ప్రకృతి వ్యవసాయ నామ సంత్సరం

2018 సంవత్సరాన్ని ప్రకృతి వ్యవసాయ నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గుంటూరులో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణా శిబిరాన్ని ఇవాళ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశిస్తూ చంద్రబాబు ప్రసంగించారు. సాగు సాఫీగా సాగాలన్నా.. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు సాధించాలన్నా... ప్రకృతి వ్యవసాయమే పరిష్కారమని అన్నారు. సేంద్రీయ వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ భవిష్యత్‌ తరాలకు మార్గనిర్దేశం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని.. చరిత్ర సృష్టించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.