భారీ వర్షాలపై చంద్రబాబు ఆరా
Published on: Wed Nov 11, 2015 11:52AM

ఆంధ్రప్రదేశ్లోన నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లతో బుధవారం నాడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా పంటలకు వాటిల్లిన నష్టం, సహాయక చర్యల మీద చంద్రబాబు ఆరా తీశారు. వర్షపాతం, పంటనష్టం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.


