రఘురామ ఇంటికి సీఐడీ పోలీసులు.. వదల బొమ్మాళీ...
Published on: Wed Jan 12, 2022 9:49AM
ఈయన తగ్గేదేలే అంటున్నారు. వాళ్లు వదిలేదే లే అంటున్నారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామను ఏపీ సీఐడీ పోలీసులు ఇంకా వెంటాడుతున్నారు. తాజాగా, హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు ఇచ్చారు. జనవరి 13, గురువారం నాడు విచారణకు హాజరుకావాలంటూ 24 గంటల సమయం మాత్రమే ఇచ్చారని తెలుస్తోంది.
టైమ్ చూసి ఏపీ సీఐడీ రఘురామను కార్నర్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుంది. గురువారం తాను తన సొంత నియోజకవర్గం నరసాపురం వస్తున్నానని.. రెండు రోజులు అక్కడే ఉంటానని ఇప్పటికే రఘురామ ఓపెన్‌గా ప్రకటించారు. పరోక్షంగా టచ్ చేసి చూడండంటూ.. జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
రఘురామను జగన్‌రెడ్డి అంత ఈజీగా మర్చిపోతారా? అంత ఈజీగా వదిలిపెడతారా? అందుకే, గురువారం పర్యటన అనగా.. బుధవారం పొద్దున్నే హైదరాబాద్‌లోని రఘురామ ఇంట్లో వాలిపోయారు. ఏవేవో కారణాలు చెప్పి.. విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈజీగా తెలిసిపోవడంలేదా? రఘురామ నర్సాపురం వెళ్లకుండా అడ్డుకోవడానికే ఆ నోటీసులు ఇచ్చారని?
ఏపీ సీఐడీ అధికారులు జారీ చేసిన నోటిసులపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఈ నెల 17 సీఐడీ విచారణకు హాజరవుతానని చెప్పారు. "గతంలో నన్ను అరెస్ట్ చేసే సమయంలో సీసీటీవీ కెమెరాలు లేకుండా చేశారు.. నా సిబ్బందిపై, నా పై వ్యక్తిగతంగా దాడి చేశారు" అని అన్నారు. సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాది అని.. ఇదంతా చూసి ముఖ్యమంత్రి జగన్ ఆనంద పడుతున్నారని ఎంపీ రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు.


