TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐ(వై)పీఎస్ సంజయ్ బెయిలు రద్దు చేసిన సుప్రీం కోర్టు

Published on: Thu Jul 31, 2025 3:22PM

కర్మఫలం ఎవరైనా అనుభవించక తప్పదు. జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన ఒక్కొక్కరూ ఇప్పడు కర్మ అనుభవిస్తున్నారు. తాజాగా ఏపీ సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ వంతు వచ్చింది.   జగన్ హయాంలో అప్పటి ఏపీసీఐడీ చీఫ్ ఐపీఎస్ అధికారిగా.. అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిగా కాకుండా  వైసీపీ పోలీస్ సర్వీస్ అధికారిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.  జగన్ హయాంలో ఏపీ సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సంజయ్ నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతీగా, జగన్ చెప్పినట్లు చేయడమే విధినిర్వహణ అన్నట్లుగా వ్యవహరించారు. సర్వీస్ రూల్స్ అనేవి ఉంటాయనీ కూడా మరిచిపోయారు.

మార్గదర్శిపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా ఆ కేసులపై మీడియా సమావేశాలలో మాట్లాడటం వంటి చర్యలకు పాల్పడ్డారు. అలాగే చంద్రబాబు స్కిల్ కేసులో  అక్రమంగా జగన్ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని సమర్ధిస్తూ పొన్నవోలుతో కలిసి హస్తినలో మీడియా సమావేశాలలో మాట్లాడారు. అయితే అంతకంటే ముందు అగ్నిమాపక శాఖ  డీజీగా ఉన్న సమయంలో అడ్డగోలుగా పాల్పడిన అవినీతికి సంబంధించిన కేసులో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిలు పొందారు. అయితే.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీం కోర్టు హైకోర్టు సంజయ్ కు బెయిలు మంజూరు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిలు పిటిషన్ విచారణలో ప్రభుత్వ వాదన వినకుండా బెయిలు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది.

అలాగే సంజయ్ పాల్పడిన అవినీతికి ఆధారాలుసమర్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అందుకు సంబంధించి పోలీసు దర్యాప్తులో  లభించిన ఆధారాలను ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. చివరికి సుప్రం కోర్టు సంజయ్ ముందస్తు బెయిలును రద్దు చేస్తూ గురువారం (జులై 31) తీర్పు వెలువరించింది. మూడు రావాలలోగా  సంజయ్ లొంగిపోవాలని ఆదేశించింది.