ఉద్యోగుల రాకతో రాజధానిలో హడావుడి..

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హైదరాబాద్లో ఉన్న ఏపీ ఉద్యోగులు దాదాపు అమరావతి చేరిపోయారు. ఈ నెల 27 వరకూ ఉద్యోగులందరూ రాజధానికి రావాల్సిందే అని చంద్రబాబు చెప్పగా.. ఉద్యోగులందరూ దాదాపు వచ్చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి వచ్చిన ఉద్యోగులకు సాదరంగా ఆహ్వానం పలికారు. గుంటూరు, కృష్ణాజిల్లలో ఇప్పటికే 25కి పైగా కార్యాలయాలు ఏర్పాటవ్వగా.. ఈ రోజు ఒక్కరోజే మరో 15 కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. అంతేకాదు హైదరాబాద్ నుండి ఏపీకి వచ్చిన 300 మండి ఉద్యోగులకు వారంరోజుల పాటు ఉచిత వసతి సౌకర్యాలు అందించనున్నారు.


విజయవాడ, గుంటూరు పరిసరాల్లో ప్రారంభమైన కార్యాలయాలు. విజయవాడ నక్కల రోడ్డులోని పాత చరితశ్రీ ఆసుపత్రి భవనంలో పంచాయితీ రాజ్ కమిషనర్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం
* మారుతీ నగర్ లోని జీపీఆర్ స్ట్రీట్ లో ఉన్న వీ ప్లాజాలో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసు
* పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న జెడ్పీ ఆఫీసులో పంచాయితీ రాజ్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రారంభించనున్నారు.
* ప్రసాదంపాడులో అద్దెకు తీసుకున్న భవంతిలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, ఏపీ బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీ, డెరైక్టరేట్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ ఆఫీసులను ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించనున్నారు.
* గొల్లపూడిలో ఆర్ డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని అయ్యన్నపాత్రుడు, అక్కడే సెర్ప్ ఆఫీసును కిమిడి మృణాళిని, శాప్ కార్యాలయాన్ని చైర్మన్ మోహన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని మంత్రి గంటా, బస్ భవన్ ను పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.