TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీది పైశాచికానందం

Published on: Fri Jun 5, 2015 7:47AM

 

ఒక మంచి పని చేయడానికి సంకల్పించినప్పుడు సాధారణంగా అడ్డంకులు ఎదురుకావు. ఒకవేళ ఎదురైనా అవి మబ్బుల్లా తొలగిపోతాయి. దీనికి తార్కాణంగా నిలిచే సందర్భం ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వచ్చింది. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడి ప్రజలందరూ కొత్త రాజధాని నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. రాజధానికి భూ సమీకరణ ఎవరు ఎన్ని అడ్డుపుల్లలు వేసినా సాఫీగా జరిగింది. చిన్న చిన్న సమస్యలు వున్నా అవి క్రమంగా దారిలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 6వ తేదీన రాజధాని నిర్మాణ పనులను భూమిపూజతో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  అలాగే వ్యవసాయ యూనివర్సిటీకి శంకుస్థాపన, 8వ తేదీన బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు వున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.  ఈ సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్న వార్తలు రావడంతో ఏపీ ప్రజలు నిరాశకు గురయ్యారు. శుభమా అని ఒక మంచి ముందడుగు వేస్తుంటే ఈ ఆటంకం ఏమిటా అని బాధపడ్డారు. అయితే ఆంధ్రప్రదేశ్ నాశనాన్ని కోరుకునే వైసీపీ మాత్రం ఈ సంగతి తెలుసుకుని ఎగిరి గంతేసింది. రాజధాని భూమిపూజ ఆగిపోతోందహో అని ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా తన మీడియా ద్వారా ఊదరగొట్టేసింది. తన పైశాచికానందాన్ని ఆ రూపంలో ప్రదర్శించింది.

అయితే మంచి పని వెంట భగవంతుడు ఎప్పుడూ వుంటాడు. ఏపీ రాజధాని భూమి పూజ విషయంలో ఎలక్షన్ కమిషన్ తన నిబంధనలను సడలించుకుంది. ఈ కార్యక్రమాలు గతంలో ఎప్పటినుంచో ప్లానింగ్‌లో ఉన్న కార్యక్రమాలు కావడం, ప్రభుత్వం ప్రచారం కోసం చేస్తున్న కార్యక్రమాలు కాకపోవడం, అలాగే ఏపీ ప్రజల మనోభావాలతో ముడిపడి వున్న అంశం కావడంతో ఈ కార్యక్రమాలకు అనుమతి మంజూరు చేసింది. దాంతో ఏపీ ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. దాంతో శనివారం నాడు ఒక మంచి కార్యక్రమం జరగనుంది. మరి ఈ విషయంలో ఇప్పటి వరకూ పండగ చేసుకున్న వైసీపీ నాయకులు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో.