TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏప్రిల్ 11న మంత్రి ప‌ద‌వి వ‌చ్చేది, ఊడేది వీరికే..!?

Published on: Wed Mar 30, 2022 11:44AM

అప్పుడూ ఇప్పుడూ అంటూ ఊరిస్తూ వ‌చ్చిన ఏపీ కేబినెట్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు ఈసారి బ‌ల‌మైన ముహూర్తం ఫిక్స్ అయింది. విశాఖ శార‌దా పీఠం స్వామి పెట్టారో, లేక క‌డ‌ప చ‌ర్చి ఫాద‌ర్ చెప్పారో కానీ.. ఏప్రిల్ 11న కొత్త‌ మంత్రిమండ‌లి కొలువుదీర‌నుంది. ప‌లువురి మంత్రి ప‌ద‌వులు ఫ‌స‌క్ కానున్నాయి. కొంద‌రికి కేబినెట్‌లో చోటు ల‌భించ‌నుంది. తీసేసేవారిలో ప‌నితీరే బేరీజు అయినా.. పార్టీ అవ‌స‌రాలంటూ అంద‌మైన క‌వ‌రింగ్‌తో వారిని ప‌క్క‌న పెట్టేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అలా ప‌ద‌వి పోయే బాధితుల్లో బొత్సా, పెద్దిరెడ్డి, బాలినేని లాంటి సీనియ‌ర్లతో పాటు వెల్లంప‌ల్లి లాంటి ప‌లువురు ప‌నిమంతులనూ(?) మంత్రిమండ‌లి నుంచి పంపించేయ‌నున్నారు. ఆ మేర‌కు సీఎం జ‌గ‌న్ కేబినెట్ క‌స‌ర‌త్తు ప‌క్కాగా చేస్తున్నారు.

ఏప్రిల్ 7న ఏపీ కేబినెట్ మీటింగ్ ఉండ‌నుంది. ప్రస్తుత మంత్రిమండలికి అదే చివరి భేటీ కానుంది. ఆ సమావేశంలో మంత్రిమండలిలో కొనసాగేవారెవరు? వైదొలగనున్నది ఎవరెవరనే విషయాన్ని సీఎం జగన్‌ స్పష్టంచేసే అవకాశం ఉంది. తొల‌గించాల్సిన‌ మంత్రులతో.. ఆ రోజే రాజీనామా చేయిస్తార‌ని అంటున్నారు. 

7న కేబినెట్‌ భేటీ జరగనుండగా.. 8న సీఎం జ‌గ‌న్‌.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవనున్న‌ట్టు తెలుస్తోంది. కేబినెట్ కూర్పు జాబితాను గ‌వ‌ర్న‌ర్‌కు అందించే అవ‌కాశం ఉంది. ఏప్రిల్ 7, 8 తేదీల్లో అన్నీ ఫిక్స్ అయిపోయినా.. మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణ మాత్రం ఏప్రిల్‌ 11న జ‌ర‌గ‌నుందని అంటున్నారు. 

ఇక‌, కొత్త కేబినెట్‌పై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి నెల‌కొంటే.. వైసీపీ ఎమ్మెల్యేల్లో మాత్రం ఉత్కంఠ ఏర్ప‌డింది. ప్ర‌స్తుత మంత్రులు త‌మ ప‌ద‌వి ఉంటుందో ఊడుతుందోన‌ని టెన్ష‌న్ ప‌డుతుంటే.. ఆశావ‌హులు మాత్రం ఊహ‌ల ప‌ల్ల‌కిలో తేలిపోతున్నారు. రోజా, ర‌జినిల‌కు ఈసారి మంత్రి ప‌ద‌వి ఖాయ‌మంటూ గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కొత్త‌గా ప‌ద‌వులు వ‌చ్చేవారి కంటే కూడా.. ఎవ‌రి ప‌ద‌వికి ఎస‌రు పెడ‌తార‌నేదానిపైనే ఎక్కువ ఆస‌క్తి క‌నిపిస్తోంది. చ‌ర్చ కూడా ప‌ద‌వులు పోయే వారిపైనే ఎక్కువ‌గా జ‌రుగుతోంది. 

కేబినెట్ నుంచి అవుట్స్ చాలానే ఉండ‌బోతున్నాయంటూ టాక్‌. అదే సంఖ్య‌లో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వ‌బోతున్నారు సీఎం జ‌గ‌న్‌. రెడ్ల‌కు ప్రాధాన్యం కొన‌సాగిస్తూనే.. ఇటీవ‌ల బీసీ సీఎం అంటూ ఆయ‌న బావ.. బ్ర‌ద‌ర్ అనిల్ పేల్చిన బాంబుతో ఈసారి బీసీల‌కు మ‌రింత ప్రాధాన్యం ద‌క్క‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే జాబితా సిద్ధం కాగా.. అనిల్ స్టేట్‌మెంట్ త‌ర్వాత వాటిలో మ‌రిన్ని మార్పులు, చేర్పులు చేస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల స‌మాచారం. జిల్లాల వారీగా వీరికే ఛాన్స్ అంటూ ప‌లు పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. మంత్రి మండ‌లి రేసులో ఉన్న ఆ ఆశావ‌హుల జాబితా ఇలా ఉంది.....

చిత్తూరు జిల్లా నుంచి:
ఆర్కే రోజా
చెవిరెడ్డి భాస్కరరెడ్డి
భూమన కరుణాకర్ రెడ్డి
 
కడప జిల్లా:
సి.రామచంద్రయ్య
చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
కొరముట్ల శ్రీనివాసులు

కర్నూలు జిల్లా:
శిల్పా చక్రపాణిరెడ్డి
హఫీజ్ ఖాన్

అనంతపురం జిల్లా:
తోపుదుర్తి సూర్య ప్రకాశ్ రెడ్డి
జొన్నలగడ్డ పద్మావతి
ఉష శ్రీ చరణ్
రామచంద్రారెడ్డి
కేతిరెడ్డగి వెంకటరెడ్డి

నెల్లూరు జిల్లా:
--మేక‌పాటి కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రిని మంత్రిని చేసి 6 నెల‌ల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటార‌ని తెలుస్తోంది.
ప్రసన్నకుమార్ రెడ్డి
కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆనం రామనారాయణ రెడ్డి
 
ప్రకాశం జిల్లా:
సుధాకర్ బాబు
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు
మహీధర్ రెడ్డి
 
గుంటూరు జిల్లా:
ఆళ్ల రామకృష్ణారెడ్డి
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
అంబటి రాంబాబు
జంగా కృష్ణమూర్తి

కృష్ణాజిల్లా:
కె. పార్థసారథి
సామినేని ఉదయభాను
మల్లాది విష్ణు
జోగి రమేష్

పశ్చిమగోదావరి జిల్లా:
తానేటి వనిత
ఎం. ప్రసాదరాజు
బాలరాజు
గ్రంధి శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా:
దాడిశెట్టి రాజా
పొన్నాడ సతీష్

విశాఖ జిల్లా:
గుడివాడ అమర్నాథ్
బి. ముత్యాల నాయుడు

విజయనగరం:
కోలగట్ల వీరభద్ర స్వామి
రాజన్న దోర

శ్రీకాకుళం జిల్లా:
తమ్మినేని సీతారాం