నలుగురు బోసులు, ఇద్దరు త్రిమూర్తులు రామచంద్రాపురంలో పోటీ?
Published on: Mon Jun 11, 2012 5:06PM
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల చీలిక కోసం మారుపేరున్న అభ్యర్థులను రంగంలోకి దించారు. ఈ అసెంబ్లీ స్థానం నుంచి మొత్తం 16మంది పోటీ చేస్తున్నారు. అందులో నలుగురు సుభాష్ చంద్రబోష్ లు, ఇద్దరు త్రిమూర్తులు రంగంలో ఉన్నారు. రామచంద్రరావులు కూడా ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఈ మూడు పేర్లు ప్రధానపార్టీల అభ్యర్థులతో మ్యాచ్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరుపున తోట త్రిమూర్తులు, తెలుగుదేశం పార్టీ తరుపున చిక్కాల రామచంద్రారావు, వై.కా.పా అభ్యర్థిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ రంగంలో ఉన్నారు. ఈ ముగ్గురి పేర్లు కలిసిన వారిని వెదికి మరీ అభ్యర్థులే తన ప్రత్యర్థులను ఓడించేందుకు రంగంలోకి దించారు. అభ్యర్థుల ఈ చీలిక రాజకీయం వల్ల ఓట్లు ఎవరు నష్టపోతారనేది ఎన్నికల ఫలితాల్లోనే తేలాలి.


