TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉప ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుల పోటీ!

Published on: Mon Jun 11, 2012 4:55PM

ap bypolls 2012, guntur district bypolls, educated candidates ap bypolls, prathipadu constituency sudhakar babu, sudhakar babu mba prathipadu, chirumamilla madhu macharla constituency, ap bypolls well educated candidatesగుంటూరు జిల్లా ఓటర్లకు శుభవార్త. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్ని ఎన్నికలు వచ్చినా గుంటూరు జిల్లా నుంచి మాత్రం ఉన్నత విద్యావంతులు పోటీ చేయలేదు. తొలిసారి ఈ జిల్లా నుంచి ఉన్నతవిద్య చదువుకున్న ఇద్దరు అభ్యర్థులు రంగలో ఉన్నారు. వీరిలో ఎంబిఎ చదివిన సుధాకరబాబు ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలానే కంప్యూటర్స్ లో బిఇ చేసి అమెరికాలో బాగా గడించిన చిరుమామిళ్ల మధు మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఉన్నతవిద్యావంతులు ఈ ఎన్నికల రంగలో ఉంటే వారిని గెలిపించుకుని సేవలందుకునేందుకు ఓటర్లు సిద్ధంగా ఉండాలి మరి. లేకపోతే ఓటరు తీర్పు వీరికి వ్యతిరేకమైతే మళ్లీ ఈ అభ్యర్థులు తమ రంగాలకు వెనక్కి వెళ్లి పోయే అవకాశాలున్నాయి. దీన్ని గమనించిన ఆ రెండు నియోజకవర్గ ఓటర్లు ఎటువంటి తీర్పు ఇస్తారోనని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు.